ఇరాన్-ఇరాక్‌లలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు.. 150మంది మృతి

సోమవారం, 13 నవంబరు 2017 (08:52 IST)
ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ భూకంపంతో 150 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, వేలాదిమంది గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌-ఇరాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు కుప్పకూలినట్లు సమాచారం. ఒక్కసారిగా భూమి కంపించిపోవడంతో భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు. గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.  
 
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి, సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి వుంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
భూకంపం తీవ్రత.. పూర్తిగా తొలగిపోలేదని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు వుండటంతో భవంతులు, లిఫ్ట్‌‌లకు ప్రజలు దూరంగా ఉండాలని ఇరాక్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషస్‌ ఇరాకీ స్టేట్‌ టీవీ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.  

వెబ్దునియా పై చదవండి