ఇరాన్‌లో జంట పేలుళ్లకు పాల్పడింది మేమే : ఇస్లామిక్ స్టేట్

ఠాగూర్

శుక్రవారం, 5 జనవరి 2024 (12:11 IST)
ఇటీవల ఇరాన్ దేశంలో జంట పేలుళ్లకు పాల్పడింది తామేనని ప్రముఖ అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇరాన్ జనరల్ ఖాసి సమాధి వద్ద జరిగిన జంట పేలుళ్లలో 84 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ సమాధి వద్ద తమ సంస్థకు చెందిన వారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని పేర్కొంది. పైగా, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు ఒమర్ అల్ మువాహిద్, సేపుల్లా అల్ ముజాహిద్ ఫోటోలను కూడా ఆ వార్తా పత్రిక అమఖ్ ద్వారా బహిర్గతం చేసింది. అయితే, ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఇరానీయులా లేకా విదేశీ పౌరులా అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. 
 
కాగా, ఇటీవల కెర్మన్‌లో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు బుధవారం భారీగా తరలివ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెల్సిందే. 2020లో అమెరికాలో జరిగిన దాడిలో సులేమానీ మృతి చెందారు. తమపై పోరాడుతూ వచ్చిన సులేమానీ మృతిని అప్పట్లో ఇస్లామిక్ స్టేట్ సంస్థ కూడా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. 
 
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక
 
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అయితే, వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పీఏ ఘటనాస్థనంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా, విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు