జపాన్ దేశంలో పాములను పెంపుడు జీవులుగా పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో పాములంటే జడుసుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే చెప్పాలి. కానీ ఓ పామును చూసి కొందరు ప్రయాణీకులు బుల్లెట్ రైలును ఆపేశారు. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోక్యో నుంచి హిరోషిమా వెళ్తున్న షింకెన్‌సన్ బుల్లెట్ రైళ్లో పాము కనిపించింది. సీట్ల మధ్య ఉన్న ఆ సర్పాన్ని ఓ ప్రయాణీకుడు చూశాడు. అంతే రైలును ఆపేశాడు.
అయితే బుల్లెట్ రైలులోని ఆ పాము ద్వారా ప్రయాణీకులకు ఎలాంటి హానీ చేకూరలేదు. బ్రౌన్ స్నేక్ లేదా రాట్ స్నేక్ అని ఈ సర్పాన్ని పిలుస్తారు. ఇది 30 సెంటీమీటర్ల పొడవు ఉంది. అయితే అది విష సర్పం కాదని అధికారులు తెలిపారు. దీన్ని కొందరు పెంపుడు జంతువుగా ట్రీట్ చేస్తారు. దాంతో రైలు సిబ్బంది రైళ్లోనే ఓ ప్రటకన చేశారు. ఎవరిదైనా పాము తప్పిపోయిందా అంటూ ప్రకటించారు.