చేపల్లో అనేక రకాల చేపలు ఉన్నాయి. చేపల రకాలను బట్టి వాటి ధరలు కూడా ఉంటాయి. మనకు తెలిసిన చేపల్లలో పులస చేప ఎక్కువ ధర పలుకుతుంది. ఈ చేపను ఆరగించేందుకు నాన్‌వెజ్ ప్రియులు అమితంగా ఇష్టపడతారు. అయితే, చేపల ధరలు కేవలం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా భారీగానే పలుకుతున్నాయి.
తాజాగా జపాన్ దేశంలో ఓ చేపల వ్యాపారి ఏకంగా 21 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ చేపను కొనుగోలు చేశారు. ఈ చేప పేరు బ్లూఫిన్ టూనా. ఈ చేపకు జపాన్ దేశంలో మంచి పేరుంది. పైగా, ఆ దేశంలో లభ్యమయ్యే అరుదైన చేప కూడా. అందుకే దీని ధర కూడా భారీగానే ఉంటుంది.