ఇలా ఈ సముద్రజలాల్లో ప్రయాణిస్తూ ఏకంగా, 33,000 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా సముద్రం గుండా ప్రయాణిస్తూ వీరంతా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటనలో తెలిపింది.