ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ తొలిసారి దేశం వీడుతున్నారు. తొలిసారి విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంగ్.. 2011లో అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా విదేశీ పర్యటనకు పర్యటించే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పటి వరకు దేశం దాటి బయటకు అడుగుపెట్టలేదు.