పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు.
బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని పంచాయతిలో శిక్ష విధించారు. బాలికకు స్నానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా ఊరేగించారు. ఈ దుర్ఘటన అక్టోబరు 27న జరిగినా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.