పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఊహించని విధంగా షాక్ కొట్టినట్టయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్థాన్‌కు వెళ్లే జలాలు ఆగిపోయాయి. ఫలితంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఈ యేడాది రబీ సీజన్ నుంచే మొదలుకానున్నాయి. ఇప్పటికే పలు పాకిస్థాన్ కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి.
ఈ ఒప్పందం రద్దుతో ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఎస్ఆర్ఏ) అంచనా ప్రకారం... సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిలో 21 శాతం మేరకు కోతపడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా చినాబ్ నదిలో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందని తేల్చింది. ఇప్పటికే సలాల, బిగ్ లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడంతో పాక్‌కు వెళ్లేనీరు చాలా వరకుతగ్గింది.