విమానంలో గాలి ఆడట్లేదని.. టేకాఫ్ అవుతుండగా కిటికీలు తెరిచేశాడు..

బుధవారం, 2 మే 2018 (14:07 IST)
చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణీకుడు జనాలను బెంబేలెత్తింపజేశాడు. గాలి ఆడట్లేదని విమానం కిటికీలను తెరిచాడు. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్థాంతరంగా ఆపేశారు. కిటికీలు తెరిచిన ప్రయాణీకుడిని సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని మిన్యాంగ్‌ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో చెన్ (25) విమానంలోని అత్యవసరం ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. 
 
సరిగ్గా టేకాఫ్ అవుతుండగా.. ఉన్నట్టుండి కిటికీ తెరిచాడు. దీంతో విమానంలోకి గాలి చొచ్చుకురావడంతో సిబ్బంది అప్రమత్తమైంది. కిటికీలను మూతబెట్టి.. టేకాఫ్‌‌ను అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో కిటికీలు తెరిస్తే గాలి వస్తుందని అలా చేశానన్నాడు. దీంతో 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70వేల యెన్‌లను జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు