నిజానికి ఈనెల 23వ తేదీనే ప్లానెట్ ఎక్స్ భూమిని ఢీకొట్టబోతుందనీ, చావడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడే ఆ తేదీ వెళ్లిపోగా, ఈసారి కొత్త డేట్‌తో మన ముందుకు వచ్చాడు. అక్టోబర్ 21 నుంచి భూమికి ఇక నూకలు చెల్లినట్లే అంటూ వాదిస్తున్నాడు. ఈసారి మాత్రం తన అంచనా తప్పదని అంటున్నాడు.
నిబిరు అనే గ్రహం మనవైపు దూసుకొందని, అది ఈ ఏడాది మన భూమిని దాటగానే.. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, అలలు ఎగిసిపడటం, ఇతర విపత్తులు సంభవిస్తాయని చెబుతున్నాడు. నాసా మాత్రం అతని అంచనాలను ఖండిస్తూనే వస్తున్నది. అసలు నిబిరు అనే గ్రహమే లేదని స్పష్టంచేసింది.