ఈ నివేదికలో 11 మంది మహిళలపై ఆయనతో పాటు ఆయన సీనియర్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టమైందని జేమ్స్ తెలిపారు. ఐదు నెలల పాటు జరిగిన ఈ విచారణలో గవర్నర్ ఆండ్రూ క్యుమో జాతీయ, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘిస్తూ పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని తేలిందని ఆమె వెల్లడించారు.
క్యుమో ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో పాటు గతంలో పనిచేసిన న్యూయార్క్ స్టేట్ ఉద్యోగినులను అభ్యంతరకరంగా తాకడం, ద్వందార్ధ వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని గవర్నర్ ఆండ్రూ క్యుమో తోసిపుచ్చారు. తాను ఏ మహిళనూ అభ్యంతరకరంగా తాకలేదని, లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు.