అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధం : హెచ్చరించిన వ్లాదిమిర్ పుతిన్

వరుణ్

గురువారం, 6 జూన్ 2024 (10:17 IST)
తమ దేశ సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధ ప్రయోగానికి కూడా తాము ఏమాత్రం వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో వివాదం, అణుయుద్ధాలు అనే ప్రశ్నకు ఆయన సూటిగా సుత్తిలేకుండా సమాధానమిచ్చారు. ఇదే అంశంపై ఆయన బుధవారం సెయింట్ పీటర్స్ బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 
 
అణుయుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తుందటూ అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ మండిపడ్డారు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికానేనని ఆయన గుర్తు చేశారు. అయితే, ముప్పు పొంచివున్నపుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు అనుమతిస్తాయని తెలిపారు. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం ఉంది. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్యం ప్రమాదంలో పడినపుడు మేము అణ్వాయుధాలు సహా అన్ని ప్రత్యామ్నాయలను అనుసరిస్తాం. ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు" అని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు