కరోనా కష్టకాలంలో ప్రపంచాన్ని భారత్ చేస్తున్న మేలును ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు. ముఖ్యంగా, భారత్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రపంచానికి ఓ బహుమతి అని అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పీటర్ హాట్జ్ చెప్పుకొచ్చారు.
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.