రష్యాకు మరో ఎదురుదెబ్బ - మరో జనరల్‌ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ బలగాలు

ఆదివారం, 27 మార్చి 2022 (17:41 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. చిన్న దేశం చిటికెలో ఓ పట్టుపట్టొచ్చని భావించి యుద్ధానికి దిగిన రష్యాకు ఉక్రెయిన్ బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఫలితంగా యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటిపోయినా ఇంకా ఉక్రెయిన్‌ను దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేక పోయింది. దీనికితోడు రష్యా సైనిక పరంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది. ఇప్పటికే ఏడుగురు జనరళ్లు సహా 15 మంది సైనికాధికారులను హతం చేసింది. తాజాగా మరో జనరల్‌ను మట్టుబెట్టింది. 
 
రష్యా సైనిక జనరళ్లు కనిపిస్తే చాలు వారిని మట్టుబెట్టడమే పరమావధిగా ఉక్రెయిన్ సాయుధ కమాండోలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నాయి. దాని ఫలితమే తాజాగా రష్యా మరో సైనిక జనరల్‌ను కల్పోయింది. ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాల ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 
 
మృతుడుని యాకోవ్ రెజాంట్సేవ్‌గా గుర్తించాయి. ఈయన రష్యా సైన్యంలో లెఫ్టినెట్ జనరల్ హోదాలో కొనసాగుతున్నారు. ఉక్రెయిన్ బలగాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయి జనరల్ హోదాలో ఉన్న అధికారుల్లో రెజాంట్సేవ్ ఏడో వ్యక్తి. అయితే, రష్యా మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు