అయితే, ఉక్రెయిన్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో వ్యూహం మార్చింది రష్యా. మేరియుపోల్ వంటి నగరాలపై దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. ఇప్పుడే మేరియుపోల్ నగరం 90 శాతం నాశనమైపోయింది. సుమారు లక్ష మంది సామాన్యులు అక్కడ చిక్కుపోయారు. వాళ్లక్కడి నుంచి బయటపడే మార్గం లేదు. వాళ్లకు ఆహారం, మంచినీరు, ఔషధాలు అందడం లేదు.
ఇకపోతే దేశంలోకి ప్రవేశించిన రష్యా సైనికుల్లో 15 వేల మంది మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే, నాటో అంచనాల ప్రకారం 7 వేలకు పైగా రష్యా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకారం, ఉక్రెయిన్‌లో నెల రోజుల రష్యా దాడి కారణంగా మరణించిన పౌరుల సంఖ్య వెయ్యికి దాటింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా పెద్ద తప్పు చేశారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆరోపించారు.