విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానంలో తండ్రీకొడుకులు గారాన్ మాయా, కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో రాండోనియా నగరం నుంచి బయలుదేరారు.
ఈ ఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.