అవినీతి ఆరోపణలు .. దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి రాజీనామా

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:56 IST)
అవినీతి ఆరోపణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకబ్ జుమా రాజీనామా చేశారు. ఈయన వయసు 75 యేళ్లు. అవినీతి ఆరోపణలు, ఆర్థిక మందగమనం ఇతర అంశాలపై ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎ.ఎన్.సీ.) రెండు నెలల క్రితమే నూతన అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు రామఫోసాను ఎన్నుకున్న విషయం తెల్సిందే.
 
కాగా జాకబ్ జుమా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. దీంతో ప్రతిపక్షాలతో కలిసి అధికార ఎఎన్‌సీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించటంతో జుమా వెనక్కి తగ్గి తానే రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడు రామపోసా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై జాకబ్ జుమా స్పందిస్తూ, పార్టీ తనను బలవంతంగా బయటకు నెట్టివేసిందని ఆక్రోశించారు. అయితే పార్టీ ఆదేశాలను తాను పాటిస్తున్నట్టు తెలిపారు. తాను తక్షణం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినాయకత్వంతో తాను విభేదిస్తున్నప్పటికీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఏఎన్‌సీ ఆదేశాలను పాటిస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు