ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కేవ్‌ను స్వాధీనం చేసుకుంది. పైగా, ఉక్రెయిన్ సైన్యం కాల్పులు ఆపితే చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాలిబన్ తీవ్రవాదులు శాంతిమంత్రం పఠిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం శాంతితో ముగించాలంటూ తాలిబన్ తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ యుద్ధం కారణంగా చాలా ప్రాణనష్టం జరుగుతుందని తాలిబన్ పాలకులు అంటున్నారు.
"ది ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్, ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తుంది. చాలా మంది పౌరులు ప్రాణనష్టం జరుగుతుంది. ఇరు వర్గాలు శాంతితో కూడిన చర్చలు చేసుకుని యుద్ధాన్ని ముగించాలి. హింసను వీడాలి" అంటూ తాలిబన్ తీవ్రవాదులు ఓ ప్రకటన చేశారు.