వీరిని కోర్టులో హాజరుపరచగా, చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టి హింసించినందుకు ఇద్దరు మైనర్ బాలికలకు ఆ ప్రాంత కోర్టు శిక్ష విధించింది. అమెరికా చట్టం ప్రకారం పసిపిల్లలను హింసించిన నేరం కింద శిక్ష విధించారు. నిందితురాళ్లిద్దరూ మైనర్లు కావడంతో వారికి సంబంధించిన వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు వారు తెలియజేశారు.