అగ్రరాజ్యం అమెరికా మంచుగడ్డలా మారిపోయింది. ఎటు చూసినా మంచు మినహ మరొకటి కనిపించడం లేదు. ఇంటి బెడ్ రూం ఫ్యాన్ సహా అన్నీ మంచు గడ్డల్లా మారిపోతున్నాయ్. ఎటు చూసినా.. మంచు మంచు. తాగడానికి గ్లాస్ నీళ్లు లేవు. తాగే నీరుకూడా మంచు గడ్డలా మారిపోయింది. పవర్ గ్రిడ్లు ఫెయిలై రోజుల తరబడి కరెంటు కూడా లేకపోవడంతో అగ్రరాజ్యం, ముఖ్యంగా టెక్సాస్ ప్రాంత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ మంచు తుఫాను ధాటికి ఇప్పటికే 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తంగా అమెరికాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో నీరు ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోయింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు ప్రభావానికి అప్రకటిత లాక్డౌన్ ఏర్పడింది. మంచు ధాటికి తట్టుకోలేక 60 మంది మృతి చెందారు. పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతోంది. రోజు వారి పనులకు అవసరమైన నీరు లేక, తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు. మంచు తుఫాను ప్రభావం టెక్సాస్, హ్యుస్టన్‌లలో మరింత తీవ్రతరమైందని అంచనా వేస్తున్నారు అధికారులు.