అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే 20 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ మంచు తుఫాను ధాటికి టెక్సాస్, ఓక్లహామా, టెన్నెసీ, ఇల్లినాయస్ రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
మరోవైపు, కరెంటు కోతలు ప్రజలను మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. విద్యుత్ కోతల ప్రభావం దాదాపు 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై పడింది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
కరెంటు కోతల కారణంగా ఆసుపత్రుల సేవలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు, టెక్సాస్‌లో ఆరు లక్షల ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో గత వారం రోజుల్లో 130 కార్లు ప్రమాదానికి గురికాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.