ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, ఈ-కామర్స్ సైట్లలోనే ఈ మోసాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఆన్‌లైన్‌లైన్లలోనే తమకు కావాల్సి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
కానీ, పలు మోసపూరిత కంపెనీలు మాత్రం బుక్ చేసిన గూడ్స్ ఐటెమ్స్ కాకుండా, ఇటుకలు, సిమెంట్ పలకలు వంటివి పంపుతున్నాయి. తాజాగా లజాడా అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తికి భారీ సైజులో ఉండే కాఫీ టేబుల్ వచ్చింది. దీన్ని చూసిన అతను ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఇది థాయ్‌లాండ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ కుర్రోడు ఐఫోన్-7పై ఆశపడ్డాడు. దీంతో ఆ ఫోన్ పలు వెబ్‌సైట్లలో శోధించగా, అందులో లజాడా అనే ఓ ఈ-కామర్స్ సైట్‌లో చాలా తక్కువ ధరకు ఐఫోన్ అమ్మకానికి పెట్టినట్టు గుర్తించారు.
తాను బుక్ చేసినప్పుడే కొంత అనుమానం కలిగిందని, చాలా తక్కువ ధరకు మొబైల్ రావడం, షిప్పింగ్ ఖర్చు ఎక్కువగా తీసుకోవడంతో కొంత అనుమానం కలిగిందని, కానీ ఐఫోన్ అనే ఆలోచనలో బుక్ చేసేశానని అతడు వివరించాడు.