అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. ఈ సుంకాలు పెంచిన వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఇందులోభాగంగా, భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం చొప్పున పన్ను విధించారు. అధికార భవనం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్ గురించి ట్రంప్ మాట్లాడుతూ, న్యూఢిల్లీ విధించిన సుంకాలను చాలా కఠినమైనవన్నారు. వారి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే అమెరికాకు వచ్చి వెళ్లారు. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా. కానీ, నేను ఆయనతో నువ్వు నా స్నేహితుడు. కానీ నువ్వు నాతో సరిగ్గా వ్యవహరించడం లేదు అని చెప్పారు. ఇండియా మా నుంచి 52 శాతం సుంకాలను వసూలు చేస్తుంది. కాబట్టి మేం దానిలో సగం అంటే 26 శాతం వసూలు చేస్తాం అని వెల్లడించారు.
అలాగే, అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములు, మిత్రదేశాలు అయిన యూరోపియన్ యూనియర్ నుంచి దిగుమతులపై 20శాతం, బ్రిటన్‌పై 10 శాతం చొప్పున సుంకాన్ని ఆయన విధించారు. జపాన్‌పై కూడా ఆయన 24 శాతం, చైనాపై ఏకంగా 34 శాతం చొప్పున పన్ను విధించారు.