ప్రకృతి విలయతాండవంతో ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు, విరిగిపడిన చెట్లు, ధ్వంసమైన కార్లు, వాహనాలు, తెగిపోయిన విద్యుత్, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభించడంతో లక్షలాది గృహాల్లో చీకటి అలముకుంది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌బాల్ సైజుతో కూడి వడగళ్లు కూడా పడినట్టు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. అర్థరాత్రి ఉన్నట్టుండి గృహాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద అనేద మంది ప్రజలు చిక్కుకున్నారు.