అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కంపెనీ ద్వారా AI మౌలిక సదుపాయాలలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించారు. దీనిని ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ AI భాగస్వామ్యంతో సృష్టిస్తున్నారు.
స్టార్‌గేట్ అని పిలువబడే ఈ వెంచర్, యూఎస్ డేటా సెంటర్లలో, కంప్యూటింగ్ శక్తిని అందించే సర్వర్లతో నిండిన భారీ భవనాలలో టెక్ కంపెనీల గణనీయమైన పెట్టుబడులకు తోడ్పడుతుంది. ఈ మూడు కంపెనీలు ఈ వెంచర్‌కు నిధులు అందించాలని యోచిస్తున్నాయి. ఇది ఇతర పెట్టుబడిదారులకు వీలుగా ఉంటుంది. టెక్సాస్‌లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 10 డేటా సెంటర్‌లతో ఇది ప్రారంభమవుతుంది.
"ఇది సాంకేతికత భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మనం చేయాలనుకుంటున్నది దానిని ఈ దేశంలోనే ఉంచడమే. చైనా ఒక పోటీదారు, ఇతరులు పోటీదారులేనని.. అందుకు దీనిని వెంటనే ప్రారంభించి, AI పురోగతికి శక్తినిచ్చేందుకు భౌతిక, వర్చువల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుందని జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అన్నారు. "కానీ ఇది నాకు చాలా పెద్ద విషయం, 500 బిలియన్ డాలర్ల స్టార్‌గేట్ ప్రాజెక్ట్" అంటూ ట్రంప్ చెప్పారు.