పసిఫిక్‌లో బద్దలైన అగ్నిపర్వతం: సునామీ హెచ్చరికలు

శనివారం, 15 జనవరి 2022 (21:41 IST)
Pacific Ocean
పసిఫిక్ మహాసముద్రంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

టోంగాకు సమీపంలో ఈ అగ్ని పర్వత విస్ఫోటనం జరిగింది. దాదాపు 8 నిమిషాల పాటు ఈ పేలుడు శబ్ధాలు వినిపించాయి. 800 కిమీ దూరంలోని ఫిజీ వరకు ఈ శబ్దాలు వినిపించాయి. అంతేగాకుండా అగ్నిపర్వతం బద్ధలు కావడంతో ప్రజు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. 
 
కాగా.. పసిఫిక్ మహాసముద్రం, అందులోని ద్వీపదేశాలు అనేక అగ్నిపర్వతాలకు నెలవు. ఈ పేలుడు ప్రభావంతో టోంగా రాజధాని నుకులోఫాపై పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు ఏర్పడ్డాయని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ పేర్కొంది. సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు