వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల నెట్‌వర్కింగ్ సేవలు శుక్రవారం రాత్రి చాలాసేపు డౌన్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్‌డేట్ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్ కూడా కాలేకపోయారు. ఎర్రర్ అనే సందేశం కనిపించడం చూసి తలలు పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
సర్వర్ డౌన్ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్ డిటెక్టర్' గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు.