వాట్సాప్‌: 24 గంటల తర్వాత మెసేజ్‌లు మాయం, త్వరలో అందుబాటులోకి (video)

శనివారం, 6 మార్చి 2021 (17:55 IST)
కొత్త అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్‌. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరువైన ఈ మెసేజింగ్‌ యాప్‌లో త్వరలో మరో అప్‌డేట్‌తో రానుంది.
 
ఇప్పటికే ఉన్న డిజప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లోనే మరో సదుపాయాన్ని చేర్చింది. ఇప్పుడు ఉన్న ఫీచర్‌ ఆధారంగా మెసేజులు వారం రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్‌ అయిపోతాయి.
 
 కానీ, 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయిపోయే ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపింది.  డిజప్పియరింగ్‌ మెసేజెస్‌తో పాటు ఆర్కైవ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌లో కూడా కొన్ని మార్పులు చేయనుంది.
ఆర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ నుంచి మెసేజ్‌ వచ్చినా అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉండే అప్‌డేట్‌ను తీసుకురానుంది. 
 
ఈ ఆప్షన్లు మనం ఎనేబుల్‌ చేసుకుంటేనే కాంటాక్ట్ అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉంటుంది. ఇవే కాకుండా వాట్సాప్‌ డిజప్పియరింగ్‌ మీడియా (ఫొటోలు, వీడియోలు), డెస్క్‌టాప్‌ వీడియో/వాయిస్‌ కాలింగ్‌ సదుపాయాల్ని అందించేందుకు సిద్ధమవుతోంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు