శ్రీలంకపై సోషల్ మీడియాపై నిషేధం - వ్యతిరేకించిన మంత్రి

ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (13:05 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం శ్రీలంక దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునిపోయేలా చేసింది. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకూ ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కార్యక్రమాలకు నిలువరించడానికి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. 
 
తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిషేధంపై అధికార పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖామంత్రి నమల్ రాజపక్స‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని, అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు