బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

ఠాగూర్

ఆదివారం, 23 మార్చి 2025 (17:06 IST)
పెంపుడు కుక్కతో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్‌ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకునేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతించలేమని తేల్చిచెప్పారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటికి ఒంటరిగా వచ్చి విమానం ఎక్కింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చిందని అధికారులు భావించారు. అయితే, విమానం బయలుదేరిన కాసేపటికి బాత్‌రూమ్‌లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి వుండటం కనిపించింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. 
 
విమానాశ్రయ అధికారులకు తెలిసిన వివరాల మేరకు.. బుధవారం అలిసన్ లారెన్స్ (57) అనే మహిళ తెల్లటి షనాసర్ కుక్కతో కలిసి ఫ్లోరిడా ఎయిర్‌పోర్టుకు వచ్చింది. కొలంబియా విమానం ఎక్కేందుకు ప్రయత్నించి అలిసన్‌ను అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలు ఆమె వద్ద లేకపోవడంతో అభ్యంతరం చెప్పారు. దీంతో అలిసన్ బాత్ రూమ్‌కు వెళ్లి తన పెంపుడు శునకాన్ని నీళ్లలో ముంచి చంపేసింది. ఆపై ఏమీ జరుగనట్టుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. 
 
బాత్‌రూమ్‌లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న పట్టీపై ఉన్న వివరాలు, ఫోన్ నంబరు ఆధారంగా దాని యజమానురాలు అలిసన్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అలిసన్ చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది. దీంతో జంతు హింస నేరం కింద ఆమెపై ఇల్లినోయీలోని లేక్‌‍కౌంటటీలో అలిసన్‌ను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు