హ్యాస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టైకాఫ్ అవుతుండగా, ఓ మహిళ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. తన దుస్తులు తొలగించి పెద్దగా అరుస్తూ అటూ తిరగడం ప్రారంభించింది. తన దుస్తులు తొలగించి, పెద్దగా అరుస్తూ అటూఇటూ తిరగడం ప్రారంభించింది. కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్ళి, దానిని బాదుతూ తనను దించేయాలని డిమాండ్ చేసింది.
సుమారు 25 నిమిషాల పాటు ఆమె ఇలాంటి చేష్టలకు పాల్పడిందని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు దాంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఒంటిపై దుప్పటికప్పి, ఫ్లైట్ దించేసి హ్యాస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించిటన్టు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.