అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహం!! వీడియో చూడండి..

ఠాగూర్

మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:55 IST)
అమెరికాలో వంద అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర్ పరిధిలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలోని ఆదివారం ఈ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. దీనికి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జై వీర హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ భారీ విగ్రహంపై హెలికాప్టరుతో పూల వర్షం కురిపించడం హైలెట్‌గా నిలిచింది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట ఈ విగ్రహాన్ని అమెరికాలో స్థిరపడిన, అక్కడ ఉన్న భారతీయులు నెలకొల్పారు. 


 

అమెరికాలోని టెక్సస్లో 100 అడుగుల వీరాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.

ఈ విగ్రహానికి "స్టాచ్యూ ఆఫ్ యూనియన్" అని నామకరణం చేశారు. pic.twitter.com/tj7jKH0l3x

— greatandhra (@greatandhranews) August 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు