జపాన్ నూతన ప్రధానమంత్రి రేసులో డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్‌కు చెందిన ఐదుగురు కీలక నేతలు నిలిచారు. ప్రస్తుత జపాన్ ప్రధానిగా ఉన్న నవటో ఖాన్ తన పదవికి ఈనెల 26వ తేదీ శుక్రవాం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త నేతను ఎన్నుకొనేందుకు పాలక పార్టీ ప్రచారం ప్రారంభించింది.
ప్రధానమంత్రి పోటీలో పాలక జపాన్ డెమోక్రటిక్ పార్టీ (డీపీజే)కి చెందిన ఐదుగురు నేతలు తమ అభ్యర్థిత్వాన్ని శనివారం ప్రకటించారు. వారిలో విదేశాంగ శాఖ మాజీ మంత్రి సీజీ మాహరా, ఆర్థిక మంత్రి బన్రీ కాయిదా అగ్రస్థానంలో ఉన్నారు.
ఆ ఐదుగురు అభ్యర్థులు శని, ఆదివారాల్లో పత్రికా గోష్టులు, చర్చలు నిర్వహించిన అనంతరం సోమవారం 398 మంది డీపీజే పార్లమెంటు సభ్యులు పార్టీ నూతన నేతను ఎన్నుకుంటారు.