పాక్‌లోని ఐరాసపై దాడి మాపనేః తాలిబన్లు

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనున్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంవద్ద సోమవారం జరిపిన దాడులు మాపనేనని తెహరీక్-ఏ-తాలిబన్ ప్రకటించింది.

ఐరాస కార్యాలయానికి సమీపంలో సోమవారంనాడు దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్ ప్రతినిధి ఆజమ్ తారిక్ మంగళవారం వెల్లడించారు. ఐరాస చేస్తున్న పనులు ముస్లింలకు మేలు చేసేటివిగా లేవని, ఐరాస మరియు విదేశీ సహాయకరమైన ఏజెన్సీలు ముస్లిమేతరులని, ఇవన్నీ కూడా అమెరికాకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని, ఈ కారణంగానే తాము ఆ సంస్థపై దాడులకు పాల్పడ్డామని ఆయన వివరించారు.

సోమవారం జరిగిన దాడుల్లో నలుగురు పాకిస్థానీయులు, ఒకరు ఇరాక్ దేశానికి చెందినవారుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలుండటం గమనార్హం.

ఇదిలావుండగా సోమవారం జరిగిన దాడుల కారణంగా నిరవధికంగా పాక్‌లోని ఐరాస కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి