నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు కుట్రపన్నుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. లష్కరే తోయిబా ఇప్పటికీ క్రియాశీలకంగానే ఉందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులతోపాటు, భారత్‌లో గతంలో జరిగిన వరుస దాడుల వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని ఐరాస అధికారి ఒకరు చెప్పారు. పశ్చిమ పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ తీవ్రవాద సంస్థ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు కుట్ర పన్నుతోందన్నారు.