యుద్ధనేరాలపై లంక నిశితంగా పరిశీలించాలి: నిరుపమా

ఎల్టీటీఈపై పోరు సందర్భంగా యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వం నిశితంగా పరిశీలించాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు అన్నారు. శ్రీలంక యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన సన్‌డే పత్రిక ప్రచురించింది. శ్రీలంక ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందని ఓ న్యూస్ ఛానెల్ యుద్ధనేరాలపై ప్రసారం చేసింది.

దీనిపై శ్రీలంక ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని నిరుపమా కావు కోరారు. భారత విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుని, అమెరికాలో భారత రాయబారిగా ఎంపికైన నిరుపమారావు శ్రీలంక పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిరుపమారావు లంక యుద్ధనేరాలపై టీవీలు, పత్రికలు ప్రసారం, ప్రచారం చేసిన కథనాలను తప్పు బట్టలేము. అయితే శ్రీలంక ప్రభుత్వం స్పందించి యుద్ధనేరాలపై నిశితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మూడో మనిషి తల దూర్చడం కుదరదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి