యెమన్: సైన్యం, గిరిజనుల ఘర్షణల్లో 40 మంది మృతి

యెమన్ సైనికులకు, సాయుధ గిరిజనుల మధ్య దేశ రాజధాని సనాకు ఉత్తరాన పర్వత ప్రాంతంలో గురువారం జరిగిన ఘర్షణల్లో 40 మంది మృతి చెందినట్లు మిలిటరీ అధికారి ఒకరు వెల్లడించారు.

యెమన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సలేహ్‌ను దించడానికి ఆరు నెలలుగా ప్రజాందోళనలు మిన్నంటాయి. అర్హబ్ ప్రాంతంలో జరుగుతున్న తీవ్ర యుద్ధం యెమన్‌లో శాంతిభద్రతల పేలవ పరిస్థితికి తార్కాణం. అల్‌ఖైదా, ఇతర మిలిటెంట్ గ్రూప్స్ ఈ పరిస్థితులను ఎక్కడ ఉపయోగించుకుంటాయోనని అమెరికాతో పాటు యెమన్ పొరుగున వున్న శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు చమురు, ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి