చతికిలబడ్డ సన్ రైజర్స్... కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం

ఔను... సన్ రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 17 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పైన కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఐపీఎల్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 14వ మ్యాచ్‌లో కోల్ కతా తొలుత బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నారిన్ 6, గంభీర్ 15, ఊతప్ప 68, పాండే 46, పఠాన్ 21, యాదవ్ 4, గ్రాండ్ హోమ్ 0, వోక్స్ 1 నాటౌవుట్, ఎక్స్‌ట్రాలు 11 కలుపుకుని 172 పరుగులు చేసింది కోల్ కతా.
 
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లు చతికిలపడ్డారు. వార్నర్ 26, ధావన్ 23, హెన్రిక్స్ 13, యువరాజ్ సింగ్ 26, హూడా 13, కట్టింగ్ 15, ఊజా 11, బిపుల్ శర్మ 21, ఎక్స్‌ట్రాలు 7 పరుగులతో 20 ఓవర్లకు 155 మాత్రమే చేయగలిగారు. దీనితో ఓటమి తప్పలేదు.

వెబ్దునియా పై చదవండి