యూఏఈలో అడుగుపెట్టిన విదేశీ స్టార్ క్రికెటర్లు!!

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (11:22 IST)
ధనిక క్రీడగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో పాల్గొనే విదేశీ స్టార్ క్రికెటర్లు తమతమ ప్రాంతాల నుంచి యూఏఈలో అడుగుపెట్టారు. ముఖ్యంగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు వివిధ ప్రాంఛైజీల తరపున ఆడుతారు. మొత్తం 21 మంది ఆసీస్‌, ఇంగ్లీష్‌ క్రికెటర్లు శనివారం బ్రిటన్‌ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా తమ జట్లు ఆడే తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉండనున్నారు. 
 
స్టార్‌ ప్లేయర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, జోఫ్రా ఆర్చర్‌, జోస్‌ బట్లర్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పాట్‌ కమిన్స్‌ తదితరులు యూకే నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి యూఏఈకి వచ్చారు. ఆతిథ్య ఇంగ్లండ్‌, ఆసీస్‌ మధ్య జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లందరూ పీపీఈ కిట్లు ధరించారు. 21 మంది ఆటగాళ్లు 36 గంటల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

 

Cummins, Morgan, Banton - All aboard ✅

The last three

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు