చెన్నై ఖాతాలో అద్భుత రికార్డు.. ఏ ఒక్కడూ 25 పరుగులు చేయలేదు.. కానీ గెలుపు..?

గురువారం, 11 మే 2023 (13:26 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీని చిత్తుగా ఓడించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కొన్ని అద్భుత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 
 
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 167 పరుగులు చేసినప్పటికీ, ఛేదనలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ టోర్నీలో విజయం సాధించడం ద్వారా సీఎస్కే కొన్ని ఘనతలను కూడా సాధించింది. 
 
ఈ మ్యాచ్‌ల్లో ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టడం ద్వారా చెన్నై ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్ మ్యాచ్‌లలో రికార్డు స్థాయిలో 100వ క్యాచ్‌ని అందుకున్నాడు.
 
అలాగే సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో మొదటిసారి ఒకే సీజన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్‌కే జట్టు ఓవరాల్‌గా చెప్పుకోదగ్గ రికార్డు సృష్టించింది. 
 
ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా 25 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేయకుండా మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. నిన్నటి మ్యాచ్‌లో శివమ్ దూబే మాత్రమే 25 పరుగులు సాధించాడు. మిగతా వారందరూ 25 కంటే తక్కువ పరుగులే చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు