గూగుల్ ప్రకటనతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. గూగుల్ ప్రకటించిన దాని ప్రకారం 15జీబీ స్టోరేజ్ వరకు మీరు ఎటువంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల, కేవలం 15జీబీ స్టోరేజీ పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి వుంటుంది.
ఇతర క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులతో పోలిస్తే గూగుల్ తక్కువ ధరలకే మెరుగైన సేవలను అందిస్తుంది. అంతేకాక, గూగుల్ ఫోటోస్‌లో అట్రాక్టివ్ ఫీచర్లు ఉంటాయి. కీవర్డ్, లొకేషన్ లేదా పేరు ద్వారా సులభంగా ఫోటోలను వెతకడం, ఆటోమేటిక్ ఫోటో బ్యాకప్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి, ఈ సేవలను పొందడానికి గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం మంచి ఎంపికని ఐటీ నిపుణులు అంటున్నారు.