అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న షార్ట్ వీడియో కంటెంట్ వేదిక బోలో ఇండ్యా నేడు బోలో మీట్స్ ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. విస్తృత శ్రేణిలో ప్రేక్షకుల కోసం పరిశ్రమలో మొట్టమొదటి అనుసంధానిత ఆధారిత పీర్2పీర్ వాణిజ్య సేవల సామర్థ్యంను తమ వేదికపై ఇది అందిస్తుంది. ప్లాట్‌ఫామ్ వ్యాప్తంగా బోలో మీట్స్‌ను ఈ వేదికపై ఆవిష్కరించడం ద్వారా బోలో ఇండ్యా ఇప్పుడు మరింత లోతుగా కంటెంట్ సర్వీస్ విభాగంలోకి చొచ్చుకుపోగలదు. అక్కడ క్రియేటర్ భాగస్వాములు తమ ప్రత్యేక నైపుణ్యాల ఆధారిత కంటెంట్ సేవలను తమ ఫాలోవర్లకు మార్కెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం 65 లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. వీరిలో 28 లక్షల మంది క్రియేటర్లు 14 భాషల వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. వినూత్నమైన సేవల ఆఫరింగ్‌తో బోలో ఇండ్యా తమ క్రియేటర్ బేస్ మార్చి 2021 నాటికి 300% వృద్ధి చెందుతుందని
అంచనా వేస్తుంది.
బోలో మీట్స్‌లో భాగంగా, ఈ వేదికపై క్రియేటర్ భాగస్వాములు ఇప్పుడు తమ ప్రత్యేకనైపుణ్య ఆధారిత సేవలను తమ ఫాలోవర్‌బేస్‌కు సృష్టించడంతో పాటుగా వాటిని పంపిణీ చేయడం కూడా సాధ్యమవుతుంది. ఈ సెషన్లను ముఖాముఖిగా ప్రైవేట్ వీడియో చాట్ రూమ్ ద్వారా లేదా ఒక సెషన్‌లో గరిష్టంగా 10 మందితో వీడియో సదస్సులను నిర్వహించడం ద్వారా చేయవచ్చు. ఈ వీడియో సెషన్లును, అతి సూక్ష్మ చెల్లింపులను యూజర్లు చేయడం ద్వారా పొందవచ్చు. తమ అభిమాన క్రియేటర్ల సదస్సుల కోసం వీరు తమ స్లాట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. బోలో మీట్స్ కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన సమావేశాలలో జ్యోతిష్యం, ఫిట్‌నెస్, సంగీతం, నృత్యం, ఇన్‌స్ట్రుమెంట్స్, హాస్యం, వ్యక్తిగత ఫైనాన్స్, బంధాలు, మానసిక ఆరోగ్యం వంటివి ఉంటాయి. ఈ సెషన్లను ప్రారంభించడానికి రమారమి టిక్కెట్ సైజ్ 100 రూపాయలుగా వ్యక్తిగతీకరించిన జ్యోతిష్య సేవల కోసం ఉంటే గరిష్టంగా 5వేల రూపాయల వరకూ భాష లేదా నృత్యం నేర్చుకోవాలనుకునే వారికి ఉంటుంది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా, శ్రీ వరుణ్ సక్సేనా, ఫౌండర్ అండ్ సీఈవో-బోలో ఇండ్యా మాట్లాడుతూ, ‘‘కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌ను పర్యవేక్షించడంతో పాటుగా ఫాలోవర్ బేస్‌ను సైతం నిర్వహించడం ద్వారా వారికి తగిన శక్తిని ప్రసాదించాలనే మా లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం. కంటెంట్ ఫ్రీక్వెన్సీ మరియు ప్లాట్‌ఫామ్‌పై నిలుపుదల విషయానిక వస్తే, క్రియేటర్ కమ్యూనిటీ మా బోలో ఇండ్యా పట్ల చూపుతున్న ప్రేమను ఓ గౌరవంగా భావిస్తున్నాం.
ఇప్పుడు బోలో మీట్స్‌ను విస్తృత శ్రేణి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడంతో, మేము కేవలం మా క్రియేటర్ భాగస్వాముల యొక్క ఆర్థిక స్వాతంత్య్ర ప్రయాణాన్ని సానుకూలంగా మార్చడమే కాదు, భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో కూర్చుని ఉన్న ప్రతిభారతీయునికీ మా సేవలను పొందే అవకాశమూ అందిస్తున్నాం. తద్వారా వారు క్రియేటర్లతో పాటుగా అభ్యసించి, వృద్ధి చెందడం, వారి సంస్కృతి, భాష మరియు కోరికలను అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది. దేశంలోని ప్రతిభావంతులకు ఆదాయ మర్గాలను తెరువడాన్ని మేము లక్ష్యంగా చేసుకున్నాం మరియు వారి అభిరుచులను మెరుగుపరుచుకుంటూనే తమ జీవితాలలో వృద్ధి చెందేందుకు వేదికనూ అందిస్తున్నాం’’ అని అన్నారు.
బోలో ఇండ్యా ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే పీర్ 2 పీర్ సర్వీస్ సామర్థ్యం ప్రాచుర్యం పొందింది. అత్యున్నత స్థాయి క్రియేటర్లతో 89% మంది యూజర్లు అనుసంధానితమవుతున్నారు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐదు నెలల్లోనే 25వేలకు పైగా వీడియో సదస్సులు డెలివరీ చేయబడ్డాయి. దీని అత్యున్నత క్రియేటర్ భాగస్వాములు ఇప్పటికే నెలకు 50–60000 వేల రూపాయలను ఈ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోని బోలో మీట్స్ ద్వారా ఆర్జిస్తున్నారు. ఇప్పుడు బోలో మీట్స్‌ను విస్తృతస్థాయి ప్రేక్షకులకు చేరువ చేయడం ద్వారా వీరి ఆర్జన మరిన్ని రెట్లు పెరగనుందని అంచనా.