త్వరలోనే జియో తరహాలో రూ.2000కే ఫీచర్ ఫోన్ విడుదల చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. వీలైతే దీపావళి పండుగలోగా ఈ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ఫోన్ తయారీ కోసం మైక్రోమాక్స్, లావా వంటి మొబైల్ తయారీ కంపెనీలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసి, 4జీ ఫీచర్ ఫోనును ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఇతర ఆపరేటర్లు కూడా ఫీచర్ ఫోన్ల తయారీ పనిలో పడ్డారు. ఇప్పటికే ఎయిర్‌టెల్, ఐడియాలు ఫీచర్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.