కాగా, ఫేస్ రికగ్నైషన్ సాంకేతికతను ఫేస్‌బుక్ 2010లో తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వాడుతున్న యూజర్లలో మూడొంతుల మంది ఫేషియల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగించడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్ ఆల్ట్ టెక్ట్స్ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది.
యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లు తొలిగిపోనున్నాయి. ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను ఫేస్‌బుక్ దానంతట అది గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తి సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్ చేయడానికి ఇక కుదరదు. ఇక ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా సాధ్యపడుతుంది.