జియోనీ సంచలనం.. 10,000 ఎంఏహెచ్ కెపాసిటీతో కొత్త స్మార్ట్ ఫోన్

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:11 IST)
Gionee M30
చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ జియోనీ సంచలనం సృష్టించింది. జియోనీ ఎం30 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రూపొందించింది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జియోనీ ఎం30 స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది.
 
10,000 ఎంఏహెచ్ కెపాసిటీ అంటే మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే పవర్ బ్యాంక్ కెపాసిటీతో సమానం. జియోనీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌ను 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్‌తో రిలీజ్ చేసింది కంపెనీ. అయితే ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో స్పష్టత లేదు.
 
ఇకపోతే.. జియోనీ ఎం30 స్పెసిఫికేషన్స్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 10,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
డిస్‌ప్లే: 6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ60
రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్
ధర: సుమారు రూ.15,000.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు