తెలుగు రాష్ట్రంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ న్యూ క్యాంపస్

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:18 IST)
ప్రపంచపటంలో ఐటికి ల్యాండ్‌మార్క్‌గా తనకంటూ ఒక అడ్రస్‌ను సృష్టించుకున్న హైదరాబాద్‌లో మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటుకానుంది. ఇప్పటికే ప్రముఖ ఐదు అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ సంస్థలు ఉండగా, ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ మరో భారీ క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనుంది. ఇందుకు కావలసిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
 
ప్రస్తుతం గూగుల్ ప్రధాన కార్యాలయం, అతిపెద్ద క్యాంపస్ అమెరికాలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేది రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది. అయితే ఇది ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్ అవుతుందట. దీని కోసం 2018లోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ అనుమతులు పొందినట్లు సమాచారం. అయితే ఈ క్యాంపస్‌లో కేవలం సోలార్ ద్వారానే కరెంట్‌ను వినియోగించుకోవాలనేది సంస్థ ఆలోచనగా కనిపిస్తోంది.
 
రూ.1.000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోయే ఈ సంస్థ ప్రాంగణం 7.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. 22 అంతస్తులతో సింగిల్ బ్లాక్‌లో కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో మూడు బేస్‌మెంట్లు (ఇందులో పార్కింగ్ కోసం రెండు), ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉండనున్నాయి. ఈ క్యాంపస్‌లో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు పని చేయనున్నట్లు సమాచారం. ఇది కనుక ఏర్పాటైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు