టీమిండియా- దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్.. జియో బంపర్ ఆఫర్

శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:19 IST)
దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా క్రికెట్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రికెట్‌ను మొబైల్, డెస్క్ టాప్‌లలో వీక్షించాలంటే హాట్‌స్టార్, సోనీ లివ్ వంటి యాప్‌లలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. దాంతో అందరికి క్రికెట్‌ను చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తకుండా.. క్రికెట్ అభిమానులకు జియో సంచలన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
 
దక్షిణాఫ్రికా-ఇండియా సిరీస్‌ను జియో తమ యూజర్లకు ఉచితంగా వీక్షించే సదుపాయం కల్పించింది. ఇందుకోసం యూజర్లు జియో టీవీ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాకుండా ఫోనులో నెట్ వుండి అందులో జియో యాప్ వుంటే సరిపోతుంది. 
 
ఇంకా దక్షిణాఫ్రికా, భారత్ సిరీస్ మొత్తం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక్షంగా వీక్షించవచ్చు. ఇందుకోసం జియో, స్టార్స్ ఇండియాతో ఒప్పుందం కుదుర్చుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు