శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జిని విడుదల చేసిన శాంసంగ్

ఐవీఆర్

మంగళవారం, 28 మే 2024 (20:38 IST)
భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, తమ అత్యున్నత ప్రీమియం గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి జిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఎఫ్ 55 5జి యొక్క సొగసైన, ఆకర్షణీయమైన సౌందర్యంతో పాటుగా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిష్  బ్యాక్ ప్యానెల్‌ దీనిని చూడగానే ఆకట్టుకునేలా మారుస్తుంది.

గెలాక్సీ ఎఫ్ 55 5జితో, శాంసంగ్ ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియోలో మొట్టమొదటిసారిగా క్లాసీ వేగన్ లెదర్ డిజైన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి సూపర్ అమోలెడ్+డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 45వాట్ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌ల వంటి ఈ విభాగపు అత్యుత్తమ ఫీచర్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది, రాబోయే సంవత్సరాలకు సైతం వినియోగదారులు తాజా ఫీచర్‌లు, మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది. 
 
“గెలాక్సీ ఎఫ్ 55 5జితో, శాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మొట్టమొదటిసారిగా జీను కుట్టు నమూనాతో క్లాసీ వేగన్ లెదర్ డిజైన్‌ను అందిస్తోంది. శాడిల్ స్టిచ్ నమూనాతో కూడిన క్లాసీ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, బంగారు రంగులో ఉన్న కెమెరా డెకో ప్రీమియం సౌందర్యాన్ని వెదజల్లుతుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి రెండు ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది.

అవి - ఆప్రికాట్ క్రష్ & రైసిన్ బ్లాక్. అదనంగా, సూపర్ అమోలెడ్+ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, నాలుగు తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, నాక్స్ భద్రతతో కూడిన సాటిలేని వాగ్దానంతో కలిపి, దాని వినియోగదారులకు అత్యుత్తమమైన అనుభవాలను అందించడంలో శాంసంగ్ శ్రేష్ఠతకు ఉదాహరణగా నిలుస్తుంది” అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎంఎక్స్ డివిజన్, శాంసంగ్ఇండియా, రాజు పుల్లన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు