ఉద్యోగులకు చెక్ పెడుతున్న కంపెనీలు.. Tik Tok ఏం చేసిందో తెలుసా?

గురువారం, 24 నవంబరు 2022 (20:46 IST)
Tik Tok
ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి పంపిచేస్తున్నాయి. ఒక్క టిక్‌టాక్ మాత్రం 3000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు సంచలనం సృష్టించింది. గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
 
ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం, అధిక వ్యయాలకు కారణమైంది. ఇది ఉద్యోగుల తొలగింపుకు దారితీసింది. ఈ నేపథ్యంలో 3,000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. టిక్‌టాక్ తన అమెరికన్ ఉద్యోగులను చాలా మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు