ఎయిర్‌టెల్ ఉపయోగించే యూజర్లు కూడా 90 రోజుల పాటు రీఛార్జ్ లేకుండా సిమ్ కార్డ్ యాక్టివ్‌గానే ఉంటుంది. యూజర్లు 15 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. వొడాఫోన్ యూజర్లు మాత్రం 90 రోజులపాటు గ్రేస్ పీరియడ్ పొందుతారు. రీఛార్జ్ చేసుకోకుండా సిమ్ యాక్టివ్‌గానే ఉంటుంది. వీళ్లు కచ్చితంగా రూ.49 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT), ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాతో సహా ప్రధాన టెలికాం ఆపరేటర్లను కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవను వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది.
మరోవైపు కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసేవారికి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని కేంద్ర టెలికాం శాఖను డాట్ ఆదేశించింది. భవిష్యత్తులో మీరు ఓటరు ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను తీసుకెళ్లినప్పటికీ ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. ఈ కొత్త రూల్‌తో సిమ్‌కార్డుల ద్వారా జరిగే మోసాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.